N కన్వెన్షన్ మొత్తం ఎంత.. నాగార్జున స్థలం ఎంత.. కబ్జా అయ్యింది ఎంత.. ఇప్పుడు ఎంత కూలగొట్టారు..?

N కన్వెన్షన్ మొత్తం ఎంత.. నాగార్జున స్థలం ఎంత.. కబ్జా అయ్యింది ఎంత.. ఇప్పుడు ఎంత కూలగొట్టారు..?

హైదరాబాద్ సిటీ సైబర్ టవర్స్ తెలుసు కదా.. ఆ సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంటుంది హీరో నాగార్జున N కన్వెన్షన్.. హైటెక్ సిటీ జంక్షన్ లో వేల కోట్ల విలువైన 10 ఎకరాల విస్తర్ణంలో ఉంటుంది హీరో నాగార్జున N కన్వెన్షన్.. ఇందులో వందలు, వేల కోట్ల డబ్బున్నోళ్ల ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి.. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డా ఈ N కన్వెన్షన్.. మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సెంటర్.. 

ఇప్పుడు హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి N కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మడిగుంట చెరువును రక్షించింది. అసలు ఎన్ కన్వెన్షన్ ఎంత.. ఇందులో నాగార్జున స్థలం ఎంత.. ఆక్రమించింది ఎంత అనేది పూర్తి తెలుసుకుందాం..

  • హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది.
  • ఈ 10 ఎకరాల్లో తుమ్మటికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో ఒక ఎకరా 12  సెంట్లు FTL ( ఫుల్ ట్యాంక్ లెవల్). మరో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌. చెరువు భూమి.
  • తుమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది. 
  • 2015లో నాగార్జున N కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుంది. 
  •  N కన్వెన్షన్.. తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే కట్టారు.. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి.. 
  • తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టింది ఎన్ కన్వెన్షన్.. ఇప్పుడు వాటిని పూర్తిగా నేల మట్టం చేశారు హైడ్రా అధికారులు.
  •  సో.. ఇప్పుడు N కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలు మాత్రమే..