ఆగస్టు 29న 'శివ' రీరిలీజ్?

ఆగస్టు 29న 'శివ' రీరిలీజ్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల రిరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన రోజు వయసురీత్యా, పరిస్థితుల రీత్యా మేము చూడలేకపోయామే అనే బాధను ఫ్యాన్స్ నుంచి దూరం చేస్తున్నాయి ఈ రిరిలీజ్ లు. దీంతో రిరిలీజ్ ల ట్రెండ్ హిట్ ఫార్ములాగా మారింది. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ రిరిలీజ్ చేసి నిర్మాతలు మరోసారి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఆదరిస్తుండడంతో పాతకాలపు హిట్ సినిమాలను నిర్మాతలు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. 

ALSO READ : Daggubati Rana: ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న దగ్గుబాటి రానా..గౌరవంగా ఉందంటూ ఎక్స్లో పోస్ట్


ఈ క్రమంలో  అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘శివ’. అయితే ఎప్పుడు నుంచో ఈ సినిమా రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఫైనల్ గా ఆగస్టు 29న కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా టాక్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.