ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన అక్మల్ అలమ్ వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీసెస్ (ఏఈపీఎస్) పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ సేవలను పొందలనుకునే ఖాతాదారులు ముందుగా వారి బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఫింగర్ ప్రింట్స్ లను బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.
లావాదేవీలు నిర్వహించాలనుకునే ఖాతాదారులు ఒక్కసారి ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్, ట్రాన్స్ఫార్ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అయితే అక్మల్.. ఏఈపీఎస్ సేవలు పొందుతున్న ఖాతాదారుల వివరాలను సేకరించి భారీ మొత్తంలో డబ్బులను డ్రా చేశాడు. ఈనెల 22న బీహార్‌లోనే అక్మల్‌ను అరెస్టు చేసిన సీఐడీలోని సైబర్ క్రైమ్స్ అధికారులు ... అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చి జైలుకు తరలించారు.