కొలంబో / న్యూఢిల్లీ : వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. ఆసియా కప్‌లో గాయపడిన స్పిన్ ఆల్రౌండర్అక్షర్ పటేల్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటంపై అనుమానంగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో అక్షర్‌కు కాలు, చేతికి గాయాలు అయ్యాయి. దీంతో అతను పూర్తి స్థాయిలో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌ల్లో అతను ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ‘గత మ్యాచ్‌లో అక్షర్‌కు పలు గాయాలు అయ్యాయి.
ఎడమ కాలిపిక్క కండర గాయంతో పాటు ముంజేతికి బాల్ తగిలి వాపు వచ్చింది. గాయాల తీవ్రత ఎలా ఉందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అందుకే ముందు జాగ్రత్తగా సుందర్‌ను పిలిపించాం. ఒకవేళ కండరంలో చీలిక లేకపోతే రెండు వారాల్లో కోలుకుంటాడు. వరల్డ్ కప్‌లో ఆడతాడు. గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం మెగా ఈవెంట్‌కు అతను డౌటే’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.