గోదావరిఖని, వెలుగు : తెలుగు సినీ ఇండస్ట్రీలో రచనా, దర్శకత్వ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న గోదావరిఖనికి చెందిన దర్శకుడు అక్షర కుమార్ సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ రీజియన్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బాధ్యతల్లో అక్షరకుమార్ రెండేండ్లపాటు ఉంటారు. ఆయన గతంలో 'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' సినిమాలకు పని చేశారు. ప్రస్తుతం 'షరతులు వర్తిస్తాయి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెన్సార్‌బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు అక్షర కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.