కన్నప్ప నుంచి శివుడి పాత్ర రివీల్.. బాలీవుడ్ స్టార్ హీరో లుక్ అదిరింది...

కన్నప్ప నుంచి శివుడి పాత్ర రివీల్.. బాలీవుడ్ స్టార్ హీరో లుక్ అదిరింది...

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో శరత్ కుమార్(తమిళ్), మోహన్ లాల్ (మళయాలం), అక్షయ్ కుమార్ (హిందీ), మోహన్ బాబు, ప్రభాస్ (గెస్ట్ రోల్) తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా AVA ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 28న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ALSO READ | Ram Gopal Varma: సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలా చేయకపోతే నన్ను కాల్చేయ్

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ సోమవారం కన్నప్ప సినిమాలోని పాత్రల్ని రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నపాత్రని రివీల్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ తెలిపారు. అయితే అక్షయ్ కుమార్ కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన పాత్రకి సంబంధించిన పోస్టర్ ని షేర్ చేశాడు. ఇందులో ఒంటి కాలుపై నిలబడి శూలం ధరించి కనిపించాడు. అలాగే "కన్నప్ప🏹 కోసం మహాదేవుని పవిత్ర ప్రకాశంలోకి అడుగుపెడుతున్నాను. ఈ ఇతిహాస కథకు ప్రాణం పోసినందుకు గౌరవంగా ఉంది. ఈ దివ్య ప్రయాణంలో శివుడు మనల్ని నడిపించుగాక. ఓం నమః శివాయ!" అంటూ క్యాప్షన్ పెట్టాడు.

దీంతో కన్నప్ప సినిమాపై అంచానాలు పెరిగాయి. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో ఇతర స్టార్ హీరోలని నటింపజేసి ఇంపాక్ట్ క్రెయిట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా హీరో మంచు విష్ణుకి సరైన హిట్ లేదు. దీంతో ఈసారి ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు.  మరి ఈసారైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.