Akshay Kumar: అందుకే బిగ్‌బాస్‌ సెట్‌ నుంచి బయటికి వచ్చేశా.. మౌనం వీడిన హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: అందుకే బిగ్‌బాస్‌ సెట్‌ నుంచి బయటికి వచ్చేశా.. మౌనం వీడిన హీరో అక్షయ్ కుమార్

సల్మాన్ ఖాన్ హోస్ట్గా నిర్వహిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఆదివారం (జనవరి 19న) గ్రాండ్ ఫినాలే జరిగింది. అయితే, బిగ్ బాస్ సీజన్ 18 విజేతను ప్రకటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నటుడు వీర్ పహారియా వచ్చారు. అయితే, షో స్టార్ట్ అవ్వకముందే హీరో అక్షయ్ కుమార్ సడెన్గా బయటికి వచ్చేయడంతో బాలీవుడ్ లో తీవ్ర చర్చ జరిగింది.

ఈ క్రమంలో హోస్ట్ సల్మాన్ ఖాన్ లేట్ గా రావడం వల్లే అక్షయ్‌ వచ్చేశారని, ఇది అక్షయ్‌కు జరిగిన అవమానం అని  జరిగిందంటూ  దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ఇక తాను సడెన్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించాడు హీరో అక్షయ్ కుమార్.    

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కైఫోర్స్‌’ (SkyForce). వింగ్‌ కమాండర్‌గా అక్షయ్‌ కనిపించనున్నారు. భారతదేశ తొలి వైమానిక దాడి ఆధారంగా సందీప్‌ కేవ్లానీ ఈ సినిమాని రూపొందించారు. శుక్రవారం 24న విడుదల కానుంది.

Also Read :- ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగ చైతన్య సందడి

స్కైఫోర్స్‌ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ, “సల్మాన్ ఖాన్ 40 నిముషాలు ఆలస్యంగా రావడం వల్ల నేను అక్కడి నుండి వచ్చేయలే. సల్మాన్ 35-40 నిమిషాలు ఆలస్యంగా వస్తానని చెప్పడంతో.. ముందుగానే ఫిక్స్ చేసుకున్న నా షూటింగ్ టైం అవుతుండటంతో బయటికి వచ్చినట్లు అక్షయ్ తెలిపారు. 

అంతేకాకుండా తన స్కైఫోర్స్‌ సినిమాను ప్రమోట్ చేయడానికి వీర్ (పహారియా) కూడా బిగ్‌బాస్‌ సెట్‌లోనే ఉన్నారు. అలా తన సినిమా విశేషాలను పంచుకున్నారని మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చాడు". దీంతో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ల మధ్య నడుస్తున్న పుకార్లపై క్లారిటీ వచ్చింది.