Kesari Chapter2: ‘కేసరి చాప్టర్ 2’ స్పెషల్‌ షో.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎమోషనల్

Kesari Chapter2: ‘కేసరి చాప్టర్ 2’ స్పెషల్‌ షో.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎమోషనల్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. 

ఇందులో అక్షయ్ కుమార్ నిర్భయ న్యాయవాది సర్ సి శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు. అమృత్సర్‌లో జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. 

ఏప్రిల్ 15న కేసరి2 సినిమా మేకర్స్ స్పెషల్ వేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ప్రదర్శనకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బిజెపి ఎంపీ బన్సూరి స్వరాజ్, ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా, మంత్రి కపిల్ మిశ్రా, మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా వివిధ మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసరి 2 షోని వీక్షించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Rekha Gupta) ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడింది. తన జీవితం మొత్తాన్ని ఈ దేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపింది. 

►ALSO READ | Jr NTR: ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ చొక్కా.. చూడ‌టానికి సింపులే.. ధర ఎంతో తెలిస్తే షాకే!

‘‘ భారతదేశ స్వేచ్ఛ కోసం లక్షలాది మంది వారి ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారి గురించి తెలిసేలా ఈ కేసరి 2 మూవీని తెరకెక్కించడం అద్భుతం. ఈ మూవీ కచ్చితంగా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మన కోసం వారి జీవితాలను త్యాగం చేసిన వారి పేర్లు కూడా మనకు తెలియదు. వారి కారణంగానే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం.

ఇప్పుడు మనం మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను నా శరీరాన్ని, మనసును, జీవితం మొత్తాన్ని నా దేశానికి అంకితం చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేఖ గుప్తా భావోద్వేగంగా మాట్లాడింది. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో కేసరి చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది.