
స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే మరియు ఆర్ మాధవన్ నటించిన 'కేసరి చాప్టర్ 2' అప్డేట్ వచ్చింది. నేడు సోమవారం (మార్చి 24న) 'కేసరి చాప్టర్ 2' టీజర్ విడుదల చేశారు మేకర్స్. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో రూపొందించబడిన ఈ టీజర్, భారత చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకదానిపై కొత్త కోణాలను చూపిస్తుంది.
అమృత్సర్‌లో జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో తుపాకీ కాల్పులు, ప్రాణాల కోసం పారిపోతున్న మహిళలు మరియు పురుషులు కేకలు, పెరుగుతున్న ఉద్రిక్తతతో టీజర్ మొదలైంది.
ఈ టీజర్‌లో అక్షయ్ కుమార్ నిర్భయ న్యాయవాది సర్ సి శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు. అక్షయ్ కుమార్ కోర్టులో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటన్నా సీన్స్ ఆసక్తిగా ఉంది. "నువ్వు ఇప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యానికి బానిసవే" అని అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్ తీవ్రతను చూపిస్తోంది.
ALSO READ | 72 గంటలు టైం ఇస్తున్నా.. బాలకృష్ణ, విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయండి: కేఏ పాల్
ఈ టీజర్కు ఆడియన్స్ నుంచి గ్రేట్ రెస్పాన్స్ వస్తుంది. ఒక అభిమాని, " అక్షయ్ కుమార్ కేవలం నటించడం కాదు. అతను కేసరి పాత్రలో జీవిస్తున్నాడు!" అని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశాడు. "అక్షయ్ కుమార్ చరిత్రకు మళ్ళీ జీవం పోస్తున్నాడు!" అని మరొక అభిమాని అన్నారు.
కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్‌ను ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ మరియు లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ మరియు అనన్య పాండే నటించారు. కేసరి చాప్టర్ 2 )2025 ఏప్రిల్ 18న) థియేటర్లలోకి రానుంది.