
అక్షయ తృతీయ రోజు ( ఏప్రిల్ 30) మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి, బంగారాన్ని కొనుగోలు చేసి, సకల సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా, పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయను చెప్పుకుంటారు. ఇలాంటి పవిత్రమైన రోజున తెలిసో.. తెలియక కొన్ని తప్పులు చేస్తే పేదరికం.. ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు ( ఏప్రిల్ 30) ఏఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. . .!
అక్షయ తృతీయ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు. ఆ రోజున ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీమహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అదే రోజు లక్ష్మీదేవి.. విష్ణుమూర్తిలకు వివాహం జరిగిందని.. పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించాడని పురాణాలు చెబుతున్నారు.
- అక్షయ తృతీయ పండుగ నాడు ( ఏప్రిల్ 30) పొరపాటున చేసే కొన్ని తప్పులు వల్ల పేదరికం వస్తుందని చెబుతున్నారు. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు మాంసాహారాన్ని భుజించకూడదు. వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డల తో వండిన ఆహారాన్ని తినకుండా ఉండడమే మంచిది.
- అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.
- అక్షయ తృతీయ పండుగనాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులను తుంచకూడదు
- అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతికూలత, దురదృష్ట దేవత అయిన జ్యేష్టాదేవిని ఇంట్లోకి ఆహ్వానించినవారు అవుతారు అందుకే... సానుకూల శక్తులను ఆహ్వానించడం కోసం... ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుభేరుడిని అగౌరపరిచే పనులు చేయకూడదు.
- అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు. కోపం, ద్వేషం, అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు. పవిత్రంగా అమ్మవారిని పూజించాలి.
- అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దలు చేతులమీదుగా అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు.
- ఆ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలా మంది స్టీలు, ప్లాస్టిక్ , అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కానీ ఆ పొరపాటు అస్సలు చేయకూడదట. అవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు.
- అక్షయ తృతీయ రోజున ఎవ్వరికి డబ్బు అప్పు ఇవ్వరాదు. ఎందుకంటే ఇది ఇంటి సంపద , శ్రేయస్సును వేరొకరి వైపు మళ్లిస్తుందని నమ్ముతారు.
- అక్షయ తృతీయ రోజున, ట్లో చీకటి ఉండకూడదు. ఎందుకంటే తల్లి శ్రీ మహాలక్ష్మి ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు. చీకటి గా ఉంటే ఆమె తిరిగి వెళ్లిపోతుంది.
- అక్షయ తృతీయ శుభ సందర్భంగా, దొంగతనం, అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
- అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం అనారోగ్యకరమైన శకునంగా పరిగణిస్తారు, ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నమ్మకాల ప్రకారం, అక్షయ తృతీయ నాడు ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవించడం అనుకూలమైనదిగా పరిగణించదు. అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.