
అక్షయతృతీయ ఈ ఏడాది (2025) ఏప్రిల్ 30న వచ్చింది. ఆరోజున బండారం కొంటే చాలా మంచిదని.. సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయం అనాదికాలం నుంచి వస్తుంది. హిందువులందరూ ఆ రోజున ఎంతో కొంత బంగారం కొంటారు. అయితే బంగారం కొనేందుకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం . . .!
అక్షయ తృతీయ రోజున ఈ సంవత్సరం(2025) అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30, బుధవారం నాడు వచ్చింది. అక్షయ తృతీయను హిందూ ధర్మంలో చాలా శుభ దినంగా భావిస్తారు. అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం... బంగారం..వెండి కొనుగోలు చేయడం వంటివి పాటించడం వలన ఇంటికి శుభాన్ని తెస్తుందని నమ్ముతారు.
- అక్షయ తృతీయ ప్రారంభం: ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 గంటలకు
- అక్షయ తృతీయ ముగింపు: ఏప్రిల్ 30 మధ్యాహ్నం 02:12 గంటలకు
- అక్షయ తృతీయ పూజా ముహూర్తం : ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు
- బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తం: ఏప్రిల్ 30 ఉదయం 05.41 నుండి మధ్యాహ్నం 02.12 వరకు
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అన్ని విధాలా విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోజున బంగారం కొనుగోలు చేస్తే సంపద పెరిగి.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | Beauty Tips : తమలపాకులే అని లైట్ తీసుకోవద్దు.. ఈ మూడు చర్మ రోగాలను ఇట్టే నయం చేస్తుంది.. ఇంట్లోనే ట్రీట్ మెంట్..!