రూ.20 కోట్లతో అక్షయకల్ప ఆర్గానిక్ ప్రాసెసింగ్​ ప్లాంట్​

రూ.20 కోట్లతో అక్షయకల్ప ఆర్గానిక్  ప్రాసెసింగ్​ ప్లాంట్​

హైదరాబాద్, వెలుగు: ఆర్గానిక్ డెయిరీ కంపెనీ అక్షయకల్ప ఆర్గానిక్  జడ్చర్లలో రూ.20 కోట్ల పెట్టుబడితో పాల ప్రాసెసింగ్​ ప్లాంట్​ను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. షాద్‌‌నగర్​లో నిర్మించిన ఫారం నుంచి తన కార్యకలాపాలను మొదలుపెట్టినట్టు తెలిపింది.  

ప్రస్తుతం 65 మందికిపైగా రైతులు తమతో పనిచేస్తుండగా, రాబోయే మూడేళ్లలో వీరి సంఖ్యను 385 మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.  కర్ణాటకలోని టిప్‌‌‌‌‌‌‌‌టూర్‌‌‌‌‌‌‌‌లో, తమిళనాడులోని చెంగల్‌‌‌‌‌‌‌‌పట్టులో తమకు ప్లాంట్లు ఉన్నాయని సంస్థ సీఈఓ శశికుమార్​చెప్పారు. 

‘‘జడ్జర్ల ప్లాంటు ప్రతిరోజూ 40 వేల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది. మేం  పాలు, పెరుగు, యోగర్ట్, నెయ్యి వంటి 8 ప్రొడక్టులను అమ్ముతున్నాం. ప్రతి నెల హైదరాబాద్​లో రూ.5.5 కోట్ల విలువైన ప్రొడక్టులు అమ్ముతున్నాం. ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఇన్వెస్ట్​ చేశాం”అని ఆయన వివరించారు.