PVCU: ప్రశాంత్ వర్మ యూనివర్స్లో ఛావా విలన్.. ఏ సినిమాలో అంటే?

PVCU: ప్రశాంత్ వర్మ యూనివర్స్లో ఛావా విలన్.. ఏ సినిమాలో అంటే?

హనుమాన్ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)'నుంచి మూడో సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI)అనే టైటిల్‌ను ఖారారు చేశారు మేకర్స్. మ‌హా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 

అయితే, ఇందులో బాలీవుడ్ సూపర్ హిట్ 'ఛావా' మూవీలో నటించిన విలన్ నటిస్తున్నట్లు సమాచారం. నేడు (ఏప్రిల్ 5న) 'మ‌హా కాళీ' సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) కీలక పాత్రలో నటిస్తున్నట్లు.. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ Xవేదికగా పోస్ట్ చేశారు.

అంతేకాకుండా ఆ పోస్ట్ను ప్రశాంత్ వర్మ సైతం రీపోస్ట్ చేశారు. దాంతో అక్షయ్ ఖన్నా కన్ఫర్మ్గా నటిస్తున్నాడనే టాక్ మొదలైంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో కనిపించిన అక్షయ్ ఖన్నా తనదైన నటనతో అదరగొట్టేశారు. ఆ రోల్కి సరైన మార్క్ క్రియేట్ చేశాడు.

గతంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో హీరోగా చేసిన అక్షయ్ ఖన్నా.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. మరి ఛావాతో క్రియేట్ చేసిన ఆ విలనిజం.. మహాకాళితో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేయనున్నాడనేది ఆసక్తి నెలకొంది.

'మ‌హా కాళీ' (MAHAKALI):

భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

►ALSO READ | ‌‌ఓటీటీ టెస్ట్ మూవీ రివ్యూ.. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ల స్పోర్ట్స్ డ్రామా కథేంటంటే?

ఇటీవలే రిలీజ్ చేసిన మ‌హా కాళీ పోస్టర్ ని గమనిస్తే.. 'ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్ లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఇందులో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చూడవచ్చు. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించారు. ఇలా ఈ ఒక్క పోస్ట‌ర్ తో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. 

ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్:

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుస్తున్నారు.ఈసారి మరింత భారీ బడ్జెట్ తో, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు. అలాగే ఈ సినిమాతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ. ఈ PVCUలో మూడో సినిమాగా మ‌హా కాళీ రాబోతుంది.