
అక్షయ తృతీయ రోజున చేసే పూజలు .. దాన ధర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆరోజు లక్ష్మీనారాయణులను.. సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. ఈ పూజతో కొన్ని పరిహారాలు చేస్తే జాతకరీత్యా దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రాశి వారు ఏ పూజ చేయాలి.. ఏ వస్తువు దానం చేయాలో తెలుసుకుందాం. . .
తెలుగు వారి కొత్త సంవవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది. మరో కొద్ది రోజుల్లో చైత్రమాసం పూర్తయి.. వైశాఖ మాసం వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం.. వైశాఖ మాసం శుక్లం తదియ రోజున అక్షయ తృతీయ ఈ ఏడాది (2025) ఏప్రిల్ 30 వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజని.. ఈరోజు ఏవస్తువు కొన్నా అక్షయపాత్ర మాదిరిగా దినదినాభివృద్ది చెందుతుని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారు తులసి మొక్క దగ్గర లక్ష్మీ నారాయణులకు ఆవాహన చేసి... లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి.. సంధ్యా సమయంలో ( సూర్యాస్తమయం) ఆవునెయ్యుతో దీపం దీపం వెలిగించాలి. అక్షయ తృతీయ రోజున ఉదయం .. దగ్గరలోని దేవాలయానికి వెళ్లి దేవాలయ పూజారికి గోధుమలను దానం చేయాలి. గోమాతకు తోటకూరను ఆహారం ఇవ్వాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించి.. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి.. ఆ తరువాత ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ రాశి వారు పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి.
మిథున రాశి: ఈ రాశి వారు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించాలి. గోవిందనామాలు పఠించి.. పెసలు దానం చేస్తే ఆర్దిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు అమ్మవారి ఆలయాన్ని దర్శించి.. దుర్గాదేవి స్త్రోత్రాన్ని పఠించాలి.. కొత్త కుండతో అన్నం వండి.. పేదలకు దానం చేయాలి.. వీటితో కందిపప్పు .. బెల్లం కూడా దానం చేయాలి.. గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టాలి.
సింహరాశి: ఈ రాశి వారు ఉదయం రుద్రాభిషేకం చేయాలి. సాయంత్రం లలిత సహస్రనామం పఠించాలి.. లేదా శ్రద్దగా వినాలి. పేదలకు నల్ల గొడుగును దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి: ఈ రాశి వారు ఉదయం.. సాయంత్రం తులసి చెట్టుదగ్గర దీపం వెలిగించాలి. దుర్గాదేవిని పూజించాలి. పేదలకు పాయసాన్ని దానం చేయాలి.
తులా రాశి: ఈ రాశి వారు హనుమంతుడికి ఆకుపూజ చేసి వడమాల సమర్పించాలి. హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేసి ..పేదలకు చెప్పులు.. బూట్లు దానం చేయాలి. గోమాతకు గోధుమలు.. తవుడు కలిపి ఆహారంగా పెట్టాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు కుబేరుడిని పూజించాలి. శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. గోమాతకు అరటి పండ్లను పెట్టాలి. అలాగే బ్రాహ్మణులకు అరటిపండ్లు.. శక్తి కొలది దక్షిణ .. తాంబూలం ఇవ్వాలి.
ధనస్సు రాశి: అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నారాయణులను విధిగా పూజించాలి. పెసరపప్పుతోచేసినపులగాన్ని గోమాతకు నైవేద్యంగా సమర్పించి.. ఆహారం ఇవ్వాలి. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.
మకరరాశి: ఈ రాశి వారు శివాలయాన్ని సందర్శించి.. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయాలి. బిల్వదళాలతో పరమేశ్వరుడిని పూజించాలి. ముత్తయిదువుకు భోజనం పెట్టి అలంకార సామాగ్రి ( చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, గంధం) ఇవ్వాలి. ఆ తరువాత కొత్త కుండలో నీటిని నింపి దానం ఇవ్వాలి.
కుంభరాశి : ఈరాశివారు ఆంజనేయస్వామి వారికి తమలపాకుల దండ వేయాలి.. స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు బెల్లం దానం చేయాలి. గోమాతకు తోటకూరను ఆహారంగా పెట్టాలి.
మీన రాశి: ఈ రాశి వారు రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. శివాలయంలో స్వామిని దర్శించి బెల్లం.. ఉప్పు.. పప్పు దానం చేయాలి.
అక్షయతృతీయ రోజున ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. జీవితంలో ఆనందం,శాంతి, శ్రేయస్సు, కుటుంబ సామరస్యం పెరుగుతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అక్షయ తృతీయ రోజున జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మన రాశి ప్రకారం తీసుకునే చర్యలు ముఖ్యంగా ఫలవంతమైనవని చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక , మానసిక శాంతిని తీసుకురావడంలో సహాయపడతాయి.
►ALSO READ | OTT Movies : ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 27) ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..స్ట్రీమింగ్ ఎక్కడంటే?