సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్ ద్వారా ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
మేధావులు, విద్యావంతులు ఏకమై కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఆకునూరి మురళి. ఓటర్లు చైతన్యవంతులై అవినీతి ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. కోదాడలో అన్ని వసతులు ఉన్నా.. ఆసుపత్రి కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం మనకు వద్దు అన్నారు. కేంద్రంలో బీజేపీ, -రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగనుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాకుండా ఇతర ఏ పార్టీకైనా ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు.
ALSO READ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన రద్దు చేస్తాం : కేటీఆర్