కేసీఆర్​ది అవినీతి, అరాచక పరిపాలన : ఆకునూరి మురళి

‘అమరుల ఆత్మబలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, అరాచక పరిపాలన సాగుతోంది. ఈ రాక్షస పాలనను అంతం చేసి, కేసీఆర్ ను ఇంటికి పంపాలి. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూములు అంటూ  హామీలిచ్చిన కేసీఆర్​  అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు.  రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారాయి. వివిధ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా..  వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది.  గ్రూప్స్ పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.  రైతుబంధు పేరుతో భూస్వాములకు రూ.28వేల కోట్లు పంచిపెడుతున్నాడు.  దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అన్ని బంధులు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కాయి.  చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్  కూడా కేసీఆర్ లాగానే  అవినీతి, అక్రమాలకు, అణిచివేతకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తున్నాడు. ’

ALSO READ :- ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయ్ : కందాల ఉపేందర్​రెడ్డి