డబుల్ ఇండ్లను MLAలు అమ్ముకుంటున్నరు : ఆకునూరి మురళి

రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ పట్టణంలోని బాలసముద్రం దగ్గర 540 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని,  ఈ ఇండ్లు కట్టడం పూర్తయి 5 సంవత్సరాలైనా పేద ప్రజలకు ఇంకా ఎందుకు పంచట్లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లున్న స్థలాల పక్కనే దాదాపుగా 300 కుటుంబాలు మురికికూపాల్లో నివసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం ఇలాంటి ఇండ్లు లక్ష వరకు ఉన్నాయని, వాటిని ప్రజలకు పంచకుండా MLAలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. దాంతో మురళి సహా అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి 8 గంటలు కస్టడీలో ఉంచారు.