ఇదేనా తెలంగాణ మోడల్​ డెవలప్​మెంట్: ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో రాష్ట్ర సర్కారు కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టకపోవడంపై రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి మండిపడ్డారు. ఇదేనా తెలంగాణ మోడల్​ డెవలప్​మెంట్​ అంటూ విమర్శిస్తూ ట్వీట్​ చేశారు. ‘‘హైదరాబాద్​లో  నాలుగు పెద్ద ఆస్పత్రులు కట్టడానికి 2021 జూన్​లో కేబినెట్​ ఆమోదించగా, 2022లో  సీఎం శంకుస్థాపన చేసి 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఎచ్చులు చెప్పారు. 

ఇవి కూడా డబుల్​ బెడ్రూం ఇండ్లు, మన ఊరు మన బడి, గురుకులాల భవనాల టైపేనా సర్​! మీకు రాజకీయాలకే  టైం సరిపోతలేదు. అంతా అబద్ధాల, అవినీతి పరిపాలన” అంటూ ఫైర్​ అయ్యారు.