![ఇంటర్ బోర్డును విజిట్ చేసిన ఆకునూరి మురళి](https://static.v6velugu.com/uploads/2025/02/akunuri-murali-visited-the-inter-board-office_qlVbeAXs7n.jpg)
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి శుక్రవారం సందర్శించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా విద్యా కమిషన్ టీంతో కలిసి విజిట్ చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ టీవీలను ఏర్పాటు చేయడంపై ఆకునూరి మురళి హర్షం వ్యక్తం చేశారు.
ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలలో సుమారు 8వేల కంటే ఎక్కువ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు అనుసంధానం చేసినట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విద్యా కమిషన్ బృందానికి వివరించారు.