
ప్రపంచంలోనే పెద్దదయిన అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను దుబాయ్‌లో 35 బిలియన్ డాలర్లు(రూ.2.9 లక్షల కోట్లు)తో నిర్మిస్తున్నట్లు దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తెలిపారు. వచ్చే పదేండ్లలో కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్‌గా నిలువనుంది. దుబాయ్‌లో త్వరలో ప్రపంచ ఎయిర్ పోర్టు, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి.
- ఏడాదికి 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా కొత్త ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు.
- ప్రస్తుతమున్న విమానాశ్రయ విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఐదు రెట్లు పెద్దది. ఇప్పుడు రెండు రన్ వేలు ఉన్నాయి.
- కొత్త ఎయిర్పోర్ట్ 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్ వేలు ఉంటాయి. అందులో సరికొత్త టెక్నాలజీని వినియోగించనున్నారు.
- దక్షిణ దుబాయ్‌లో చేపడుతున్న ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ నగరం నిర్మించనున్నారు.