సంబురంగా అలయ్.. బలయ్

సంబురంగా అలయ్.. బలయ్

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆదివారం ‘అలయ్ బలయ్’ సంబురంగా కొనసాగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో  తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. అతిథులను ముందుగా కోయ, డోలు, కోలాటం, పులివేషం వంటి రాష్ట్ర సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ కళాకారులు స్వాగతించారు.

 ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయ శంకర్, గుర్మిత్ సింగ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. 

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించారు.  అనంతరం అతిథుల కోసం సుమారు 60 రకాల నోరూరించే తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించారు. ప్రతి ఏటా దసరా తర్వాత రోజున రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ ని దత్తాత్రేయ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారు.

 –  వెలుగు, హైదరాబాద్.

 

​​​​​​​​​​​​​​​​​​​​​