ఇవాళ నాంపల్లిలో అలయ్ బలయ్ 

ఇవాళ నాంపల్లిలో అలయ్ బలయ్ 

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఇవాళ అలయ్.. బలయ్ కార్యక్రమం జరుగుతుంది. 2005లో గవర్నర్ బండారు దత్తాత్రేయ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈసారి ఆయన తనయ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏటా దసరా సందర్భంగా అలయ్.. బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తోపాటు రాజకీయ ప్రముఖులు, హీరో చిరంజీవితోపాటు సినీ ప్రముఖులు, నటులు తదితరులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలను చాటే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అతిథులకు తెలంగాణ రుచులు చూపించే విధంగా ఏర్పాట్లు చేశారు.