కురుమలు అన్ని రంగాల్లో ముందుండాలి :  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

కురుమలు అన్ని రంగాల్లో ముందుండాలి :  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
  • ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

చేర్యాల, వెలుగు:  కురుమలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.  బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని సిద్ధులగుట్ట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత చేర్యాలకు వచ్చిన క్రమంలో  కురుమ సంఘం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కురుమలు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.  

కురుమల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కురుమల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ భానుక శివరాజ్, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత- వెంకన్న, సిద్దిపేట జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి అందే నాని కురుమ,  బీరయ్య, అందె అశోక్,  జే. యాదగిరి, సూర్ణ శ్రీశైలం, కామల్ల అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య, సూర్న శ్రీకాంత్, మీస పార్వతి- సత్యనారాయణ, గౌండ్ల శ్రీనివాస్, చిగుళ్ల రాములు, కడారి నవీన్, రాజు, మల్లేశం, మండల నాయకులు పాల్గొన్నారు.