
గద్వాల, వెలుగు: అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ పంచాయితీ ప్రగతి భవన్ కు చేరింది. శుక్రవారం చల్ల వర్గానికి చెందిన నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ లీడర్లు మంత్రి కేటీఆర్ ను కలిసి టికెట్ క్యాన్సిల్ చేయాలని కోరారు. అబ్రహంకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని చెబుతూ, ర్యాలీలు, నిరసనలు తెలిపారు. నియోజకవర్గంలోని లీడర్లంతా కలిసి కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.