రైతులకు అండగా ఉంటాం : నీలి శ్రీనివాసులు

రైతులకు అండగా ఉంటాం :   నీలి శ్రీనివాసులు

అలంపూర్, వెలుగు: రైతులకు అండగా ఉంటామని గ్రంథాలయ చైర్మన్  నీలి శ్రీనివాసులు తెలిపారు. అలంపూర్  చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్  యార్డులో బుధవారం మార్క్ ఫెడ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్  దొడ్డన్న, వైస్  చైర్మన్  పచ్చర్ల కుమార్​తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకొనేందుకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కందులకు క్వింటాకు రూ.7,550 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.  కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్క్​ఫెడ్  డీఎం నాగేశ్, మార్కెట్  సెక్రటరీ ఎల్ల స్వామి, డైరెక్టర్లు కృష్ణయ్య, సులోచనమ్మ, రుక్మానంద రెడ్డి, శ్రీకాంత్, నాగరాజు, మస్తాన్  పాల్గొన్నారు.