ఇథనాల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఉద్యమం తప్పదు

ఇథనాల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఉద్యమం తప్పదు
  • పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ స్థలం వద్ద ఆలంపూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే విజయుడు ధర్నా

శాంతినగర్, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఉద్యమం తప్పదని ఆలంపూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు. శనివారం ఫ్యాక్టరీ స్థలం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ కోసం ప్రజలు, రైతుల ప్రాణాలను ఫణంగా పెడితే ఊరుకునేది లేదన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇప్పటికే లెటర్‌‌‌‌‌‌‌‌ పంపడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీల పేరుతో పచ్చని పల్లెల్లో చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. ఫ్యాక్టరీ కారణంగా వాతావరణంలో మార్పులు జరిగి, ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, అభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీకి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్, మాన్‌‌‌‌‌‌‌‌దొడ్డి, తుమ్మిళ్ల, తనగల, చిన్న తాండ్రపాడు, పచ్చర్ల గ్రామాల రైతులు,  ప్రజలు ఉన్నారు.