ENG v AUS: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'.. షేన్ వార్న్‌ను గుర్తు చేసిందిగా

ENG v AUS: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'.. షేన్ వార్న్‌ను గుర్తు చేసిందిగా

ప్రపంచంలో బెస్ట్ లెగ్ స్పిన్నర్ గా ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ కు పేరుంది. అతని స్పిన్ ధాటికి ప్రత్యర్ధులకు పిచ్చెక్కాల్సిందే. బాల్ ఎక్కడ పడి ఎక్కడకు తిరుగుతుందో అంచనా వేయడం కష్టం. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ లో తన హవా చూపించిన ఈ ఆసీస్ స్పిన్నర్ ను రీప్లేస్ చేసేవారు ఇప్పటికీ రాలేదు. అయితే ఆస్ట్రేలియా మహిళా లెగ్ స్పిన్నర్ తన అద్భుతమైన బంతితో షేన్ వార్న్ ను గుర్తు చేసింది. యాషెస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

మెల్‌బోర్న్‌లో జరిగిన డే-నైట్ టెస్ట్‌లో మూడో రోజు ఆటలో అలానా కింగ్ తన స్పిన్ తో ఇంగ్లీష్ జట్టును వణికించింది. రెండో సెషన్‌లో నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను ఏకపక్షం చేసింది. ఈ క్రమంలో ఆమె తీసుకున్న డంక్లీ వికెట్ క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డెలివరీగా పరిగణిస్తున్నారు. లెగ్ సైడ్‌లో వేసిన బంతి పిచ్ పై తిరుగుతూ ఆఫ్ సైడ్ వికెట్ ను గిరాటేసింది. కింగ్ తీసిన ఈ వికెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వికెట్ మహిళా క్రికెట్ లో "బాల్ ఆఫ్ ది సెంచరీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ | Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్‌ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం

1993 లోయాషెస్ లో కూడా షేన్ వార్న్ ఇలాంటి తరహాలోనే ఇంగ్లాండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను అవుట్ చేశాడు. మెల్ బోర్న్ లో వార్న్ చేసిన సేవలకు గాను అతని ఒక స్టాండ్ కు తన పేరు పెట్టారు. అతని స్టాండ్ నుంచి బౌలింగ్ చేస్తూ కింగ్ వికెట్ తీయడం విశేషం. షేన్ వార్న్ తన కెరీర్ లో మొత్తం 1001 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో (731) అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. వన్డేల్లో 293 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఏకపక్షంగా సాగిన ఏకైక టెస్టులో  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 122 పరుగుల తేడాతో విజయం సాధించి యాషెస్ కైవసం చేసుకుంది.