అలనాటి రామచంద్రుడు మూవీ .. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం అలనాటి రామచంద్రుడు. శనివారం ఈ మూవీ  రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.  

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై బజ్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేశాయి. ఈ  చిత్రంలో బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నాడు.