2024ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసిన వైసీపీ శ్రేణులు ఓటమి నుండి ఇంకా బయటపడలేక పోతున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ ఓటమికి గల కారణాలను నిర్దారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేత ఆలపాటి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలను కప్పి పుచ్ఛి ప్రజలను మోసం చేయలేనని జగన్ అన్నారని ఓ మీడియా ఇంటర్వ్యూలో అన్నారు లక్ష్మీనారాయణ.
దమ్మున్న నాయకుడు కాబట్టే ప్రజలను మోసం చేయలేదు ప్రజలే జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు
— 🇸🇱 సిద్దం ✊ (@YSR175) June 27, 2024
💪❤️❤️ pic.twitter.com/WpDk2TiqIo
ఆలపాటి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలవరం విషయంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలవరం విషయంలో డ్యామేజ్ ని కప్పి పుచ్ఛి పనులు కొనసాగిస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ప్లాన్ మార్చమని చెప్పిన జగన్ లాంటి సీఎం ఎక్కడా ఉండరని అన్నారు లక్ష్మీనారాయణ.