Alasdair Evans: అంతర్జాతీయ క్రికెట్‌కు స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

Alasdair Evans: అంతర్జాతీయ క్రికెట్‌కు స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ అలస్డైర్ ఎవాన్స్ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2009లో కెనడాతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఈ పేసర్ తన 15 ఏళ్ళ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో 99 వికెట్లను పడగొట్టాడు. 41 మ్యాచ్ ల్లో 58 వికెట్లను పడగొట్టిన ఈ సీనియర్ పేసర్.. 35 టీ20 మ్యాచ్ ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 2022 లో తన చివరి టీ20 మ్యాచ్.. 2023 లో జూన్‌లో జింబాబ్వేలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతని చివరి వన్డేతో పాటు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 

ALSO READ | Prabath Jayasuriya: 15 మ్యాచ్‌ల్లోనే 88 వికెట్లు.. టెస్ట్ క్రికెట్‌లో లంక స్పిన్నర్ దూకుడు

2013లో కెన్యాపై 30 పరుగులకు ఆరు వికెట్లు తీసి కెరీర్ లో అత్యున్నత గణాంకాలను నమోదు చేశాడు. కెరీర్ లో మొత్తం మూడు వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. 2015 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్.. భారత్ వేదికగా 2016 టీ20 ప్రపంచ కప్..  ఒమన్ యూఏఈ వేదికగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సభ్యుడు. తన క్రికెట్ కెరీర్ లో స్కాట్లాండ్, డెర్బీషైర్, మేరీల్బోన్ క్రికెట్ క్లబ్, గ్లాస్గో జెయింట్స్, మాంట్రియల్ టైగర్స్, డర్హామ్ జట్ల తరపున ఆడాడు.