
తన కస్టమర్ల కోసం ఫోన్ల ధరలను తగ్గించింది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ సంస్థ సాంసంగ్. గెలాక్సీ A7 (2018), A9 (2018) ఫోన్ల ధరలను తగ్గించింది. గెలాక్సీ A9 (2018) ఫోన్‌కు చెందిన 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియెంట్ రూ.28 వేల 990కు బదులుగా ఇప్పుడు రూ.25 వేల990 ధరకే లభిస్తుంది. ఇదే ఫోన్‌కు చెందిన 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియెంట్ రూ.31 వేల990కి బదులుగా రూ.28వేల990కే లభిస్తుంది. గెలాక్సీ A7 (2018) ఫోన్‌కు చెందిన 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియెంట్ రూ.18 వేల990కి బదులుగా రూ.15వేల990 ధరకు తగ్గింది. ఇదే ఫోన్‌కు చెందిన 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియెంట్ రూ.22 వేల990 కి బదులుగా రూ.19వేల990 ధరకు తగ్గింది. ఈ క్రమంలో ఈ రెండు ఫోన్లకు చెందిన వేరియెంట్లు ఇప్పుడు వినియోగదారులకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయని తెలిపింది సాంసంగ్.