నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పడేందుకు అలయ్ బలయ్ కీలక పాత్ర పోషించిందన్నారు. 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ కుటుంబం దిగ్విజయంగా నిర్వహిస్తుందని తెలిపారు.దసరా అంటే జమ్మిచెట్టు.. పాలపిట్ట గుర్తొస్తే... అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయ గుర్తుకు వస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.