ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌

పారిస్‌‌‌‌‌‌‌‌: స్పెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. తొలి  ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌కు అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ సెమీస్‌‌‌‌‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 2–6, 6–3, 3–6, 6–4, 6–3తో రెండోసీడ్  జానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ (ఇటలీ)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. దీంతో మూడు కోర్టుల్లో (క్లే, హార్డ్‌‌‌‌‌‌‌‌, గ్రాస్‌‌‌‌‌‌‌‌) ఫైనల్లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 1 నెల) అతను రికార్డులకెక్కాడు. ఆండ్రీ అగస్సీ (22 ఏళ్ల 1 నెల), బోర్న్‌‌‌‌‌‌‌‌ బోర్గ్‌‌‌‌‌‌‌‌ (22 ఏళ్ల 2 నెలలు), రఫెల్‌‌‌‌‌‌‌‌ నడాల్‌‌‌‌‌‌‌‌ (22 ఏళ్ల 6 నెలలు), జిమ్‌‌‌‌‌‌‌‌ కొరియర్‌‌‌‌‌‌‌‌ (22 ఏళ్ల 10 నెలలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇక సినర్‌‌‌‌‌‌‌‌తో 4 గంటలా 9 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ రెండుసార్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు చేజార్చుకున్నాడు. కానీ మూడో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌‌‌‌‌‌‌‌లో సినర్‌‌‌‌‌‌‌‌ కాలి పిక్క కండరాలు పట్టేయడం కూడా అల్కరాజ్‌‌‌‌‌‌‌‌కు కలిసొచ్చింది. నాలుగో సెట్‌‌‌‌‌‌‌‌లో లాంగ్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలు ఆడిన స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగాడు. 

దీంతో సినర్‌‌‌‌‌‌‌‌ అనుకున్న స్థాయిలో రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 8 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 7 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేయగా, సినర్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో కూడా సేమ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 14 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఆరింటిని మాత్రమే కాచుకున్నాడు. సినర్‌‌‌‌‌‌‌‌ 10 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఆరింటిని నిలబెట్టుకున్నాడు. 


నేడు విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌
ఇగా స్వైటెక్ X జాస్మిన్‌‌‌‌‌‌‌‌ పౌలిని, సా.6.30