
- మూడో రౌండ్‌లో సినర్, స్వైటెక్
పారిస్ : యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 5–7, 4–6తో అన్‌సీడెడ్, 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 15 వరుస విజయాలకు బ్రేక్ పడింది.
ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) 6–4, 6–0, 6–2తో మిచెల్‌సెన్ (అమెరికా)పై, మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–2, 7–6 (7/5)తో మరోజెసెన్ (హంగేరి)పై గెలిచారు. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్) 6–0, 6–1తో షిబహర (చైనా)పై, ముచోవా (చెక్) 6–3, 7–6 (7/5)తో నవోమి ఒసాకా (జపాన్)పై
పెగులా (అమెరికా) 7–6 (7/4), 6–3తో కెనిన్ (అమెరికా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు. మెన్స్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లో ఇండియా స్టార్ రోహన్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.