వింబుల్డన్ గ్రాండ్‌‌‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌, పౌలిని

వింబుల్డన్ గ్రాండ్‌‌‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్‌‌‌‌, పౌలిని

లండన్‌‌‌‌: వింబుల్డన్ గ్రాండ్‌‌‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌‌‌‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా, టాప్ సీడ్ జానిక్ సినర్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో జాస్మిన్ పౌలిని ముందంజ వేసింది. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్‌‌‌‌) 6–3, 6–4, 1–6, 7–5తో యుగో హంబర్ట్‌‌‌‌పై విజయం సాధించాడు.  ఈ మ్యాచ్‌‌‌‌లో ఇరువురు ఆటగాళ్లు పదునైన సర్వీస్‌‌‌‌లు, ఏస్‌‌‌‌లతో అదరగొట్టారు. అల్కరాజ్ 14 ఏస్‌‌‌‌లు కొట్టగా.. హంబర్ట్‌‌‌‌ పది సంధించాడు. హంబర్ట్ ఒకే డబుల్ ఫాల్ట్‌‌‌‌ చేయగా.. అల్కరాజ్‌‌‌‌ ఆరు చేశాడు. 

అయితే, ఫస్ట్ సర్వీస్‌‌‌‌తో పాటు  కీలక సమయాల్లో సత్తా చాటిన అల్కరాజ్‌‌‌‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. మరో మ్యాచ్‌‌‌‌లో ఇటలీ స్టార్ సినర్ 6–2, 6–4, 7–6 (11/9)తో బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించాడు. విమెన్స్‌‌‌‌ ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఏడో సీడ్ పౌలిని (ఇటలీ)  6–3, 6–7 (86/8), 5–5తో ఉన్నప్పుడు 12వ సీడ్‌‌‌‌ మారిసన్ కీస్ (అమెరికా) కాలు గాయంతో తప్పుకుంది. దాంతో వాకోవర్‌‌‌‌‌‌‌‌తో పౌలిని క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.