ఫ్లిప్​కార్ట్​లో అల్కాటెల్ ​ఫోన్లు

ఫ్లిప్​కార్ట్​లో అల్కాటెల్ ​ఫోన్లు

హైదరాబాద్: ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్​  బ్రాండ్ అల్కాటెల్ స్మార్ట్​ఫోన్లు ఈ–కామర్స్​ ప్లాట్​ఫామ్​ ఫ్లిప్​కార్ట్​ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య గురువారం రిటైల్ భాగస్వామ్యం కుదిరింది. ఫ్లిప్​కార్ట్​ క్విక్ కామర్స్, ఎఫ్ కే మినిట్స్ ద్వారా కూడా ఫోన్లను ఆర్డర్​చేయవచ్చు. 

వీటిలో ఆర్డర్​చేస్తే గంటల వ్యవధిలోనే డెలివరీ వస్తుంది.  భారతీయ యువతకు పేటెంటెడ్​, అత్యాధునిక టెక్నాలజీలతో  ఫోన్లను అందిస్తామని అల్కాటెల్​ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అతుల్ వివేక్ చెప్పారు. ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్​ప్రొడక్టులనూ అమ్మే ఆలోచన ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.