
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ టెక్నాలజీ బ్రాండ్ ఆల్కాటెల్ఫోన్లను మళ్లీ ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తామని దీనిని ఆపరేట్ చేస్తున్న నెక్స్ట్టెల్ ప్రకటించింది. ఇందుకోసం 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 260 కోట్లు) కేటాయించిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. నోకియా నుంచి ట్రేడ్‌మార్క్ లైసెన్స్ ఒప్పందం కింద చైనీస్ సంస్థ టీసీఎల్కమ్యూనికేషన్ ద్వారా ఆల్కాటెల్ వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ ప్లాన్ల తయారీ, సప్లై చెయిన్డెవెలప్మెంట్వంటి పనుల్లో ఉన్నామని ఆల్కాటెల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అతుల్ వివేక్ తెలిపారు.
ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్వస్తువులు తయారు చేసే ఆలోచనలూ ఉన్నాయని వెల్లడించారు. ప్రతి నిర్ణయమూ మార్కెట్ నుంచి వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. రూ. 20వేలు–-రూ. 25వేల ధరల విభాగంలో ఫోన్లు అమ్మే ప్రపోజల్స్ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్లలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.