యువకులకు దిశానిర్దేశం చేసేలా ‘ఏఎల్‌‌సీసీ’ సినిమా

యువకులకు దిశానిర్దేశం చేసేలా ‘ఏఎల్‌‌సీసీ’ సినిమా

జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా లేలీధర్ రావు కోలా దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఏఎల్‌‌సీసీ’. ఈనెల 25న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు దర్శకులు వి సముద్ర, నగేష్ అతిథులుగా హాజరై  సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సందర్భంగా జేవీ నవీన్ మాట్లాడుతూ ‘ఇదొక సందేశాత్మక చిత్రం. అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుతున్నా’ అని అన్నాడు.

ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని, తన పాత్ర అందరికీ నచ్చుతుందని శ్రావణి శెట్టి చెప్పింది. దర్శక నిర్మాత లేలీధర్ రావు మాట్లాడుతూ ‘మధ్యతరగతి వారికి విలువలే ఆధారం, చదువే ఒక ఆయుధం, కష్టమే ఒక వాహనం అని చూపించే చిత్రమే ఇది. యువకులకు దిశానిర్దేశం చేసేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.