ఆల్కహాల్ వల్ల ఏటా 30 లక్షల మంది మృతి

ఆల్కహాల్ వల్ల ఏటా 30 లక్షల మంది మృతి

ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తుందని  చెప్పింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినయోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం 2019లో మద్యం సేవించడం వల్ల 26 లక్షల మరణాలు సంభవించాయని, ఆ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం మరణాల్లో 4.7% మంది మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. 

ఆ మరణాలలో దాదాపు మూడొంతుల మంది పురుషులేనని నివేదిక తెలిపింది. 2019లో ఆల్కహాల్ కారణంగా సంభవించిన అన్ని మరణాలలో, 1.6 మిలియన్ల మరణాలు నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధుల నుండి సంభవించాయని అంచనా వేసింది.  ఇందులో 4 లక్షల 74 వేల  మంది గుండె సంబంధ వ్యాధులతో 4 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారని తెలిపింది.   అన్ని సమస్యల్లో ఒక మంచి విషయం ఏంటంటే 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కొంత తగ్గిందని నివేదిక పేర్కొంది. కానీ ఆల్కహాల్ వల్ల ఆరోగ్యం, సామాజిక భారం ఇంకా ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు.