మందు మానేయడం ఇంత ఈజీనా.. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి..

మందు మానేయడం ఇంత ఈజీనా.. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి..

ఈరోజుల్లో మందు తాగడం చాలా కామన్ అయిపోయింది.. తాగుడు అలవాటు లేదంటే అదేదో నేరం చేసినట్లు చూస్తారు చాలా మంది. మందు తాగకపొతే అందరిలో చులకన అయిపోతామేమో అని భయపడి బలవంతంగా అలవాటు చేసుకున్నోళ్ళు కూడా చాలామంది ఉంటారు. మొదట సరదాగా అలవాటైన మద్యపానం.. ఆ తర్వాత వ్యసనంగా మారి ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్నోళ్ళు కూడా చాలామందే ఉన్నారు సొసైటీలో.

అయితే.. మందు మానేయాలని ఎంత ట్రై చేసినా మానేయలేకపోతున్నామని ప్రతిఒక్కరు కంప్లైంట్ చేస్తుంటారు.అలాంటివారి కోసమే ఈ సింపుల్ టిప్. ఈ టిప్ గనక ఫాలో అయ్యారంటే మందు తాగమని మిమ్మల్ని ఎవరూ ఫోర్స్ చేయరు.

మందు మానేయడం ఎలా:

మందు మానేయాలని అనుకునేవారు పార్టీల్లో స్వీట్ కాక్ టైల్స్ తీసుకుంటూ ఉంటారు... వీటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. కాక్ టైల్స్ తాగడం వల్ల మందు మీద ధ్యాస తగ్గకపోగా కాక్ టైల్స్ అధికంగా ఉండే షుగర్ కంటెంట్ వల్ల బరువు పెరుగుతారు. కాక్ టైల్స్ తాగడానికి బదులు ఈ చిన్న టిప్ ఫాలో అయితే.. మద్యం మానేయడం చాలా ఈజీ అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:-మండే ఎండలు, వాతావరణంలో మార్పులతో వచ్చే వ్యాధులు ఇవే.. 

పార్టీలకి వెళ్ళినప్పుడు మందు తాగమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయకుండా ఉండాలంటే.. గ్లాస్ లో చేదుగా ఉండే కాకరకాయ జ్యూస్ తో పాటు ఒక నారింజ ముక్క కలిపి తీసుకుంటే చూసేవారికి అది డ్రింక్ లాగానే కనపడుతుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు తాగమని ఫోర్స్ చెయ్యరు. పైగా ఈ జ్యూస్ తాగడం వల్ల మన పొట్ట కూడా క్లీన్ అవుతుంది. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మందు మానేశానని ప్రతిఒక్కరికి వివరణ ఇచ్చుకునే బాధ కూడా తప్పుతుంది.

సో.. మందు మానేయాలి అనుకునేవారు వెంటనే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి... పెద్దగా ఖర్చు లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.