ఎంత మంచి ఎంపీనో.. గెలిచినందుకు జనానికి బీరు, బిర్యానీ పార్టీ

ఎంత మంచి ఎంపీనో.. గెలిచినందుకు జనానికి బీరు, బిర్యానీ పార్టీ

మనం సంతోషంగా ఉంటే ఏం చేస్తాం.. పార్టీ చేసుకుంటాం.. అదే పొలిటికల్ లీడ్సర్స్ అయితే పోలింగ్ ముందు పార్టీలు ఇస్తారు.. ఎన్నికల తర్వాత కూడా ఇలాగే పార్టీలు ఇస్తారా అంటే కచ్చితంగా ఇవ్వరు అంటారు జనం.. కర్నాటక రాష్ట్రంలోని బీజేపీ ఎంపీ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఎంపీగా గెలిచినందుకు.. నియోజకవర్గంలోని ప్రజలకు మందు పార్టీ ఇచ్చాడు.. పెద్ద గ్రౌండ్ లో.. లారీల కొద్దీ మందు బాటిళ్లు తీసుకొచ్చి.. బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి.. జనానికి పంచి పెట్టాడు.. ఎస్.. అవును ఇది నిజం.. దేశంలోనే హాట్ టాపిక్ అయిన ఈ పార్టీపై పూర్తి విశేషాలు చూద్దాం...

కర్నాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున కె.సుధాకర్ పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గం ఓటర్లకు కృతజ్ణతగా.. పార్టీ ఇవ్వాలని ఎంపీ అనుచరులు నిర్ణయించారు. అనుకున్నట్లుగానే నేలమంగళ పట్టణ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ చౌదరి ఆధ్వర్యంలో.. సిటీలోని ఓ పెద్ద గ్రౌండ్ లో బీరు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు పంచి పెట్టారు. 15 వేల మంది వరకు వస్తారని నిర్ణయించి.. అందుకు తగ్గట్టుగానే నాలుగు పెద్ద కంటైనర్లతో బీరు బాటిళ్లు తెప్పించారు. మరో లారీలో బిర్యానీ ప్యాకెట్లు తెచ్చారు.

దీని కోసం పోలీస్ పర్మీషన్ కూడా తీసుకున్నారు. కాకపోతే 15 వేల మంది వస్తారని అంచనా వేయగా.. ఊహించని విధంగా 60 వేల మంది వరకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. కంట్రోల్ చేయటం సాధ్యం కాలేదు. ఓ 20 వేల మందికి.. ఒక్కొక్కరికీ బీరు బాటిల్, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వచ్చాయి.

బహిరంగంగా మద్యం, బిర్యానీ పంపిణీ చేయటం ఏంటని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది. జనం డెంగ్యూ, మలేరియాతో అల్లాడిపోతున్నారని.. ఇలాంటి టైంలో ఏంటీ పార్టీలు అని.. పోలీసులు ఎలా పర్మీషన్ ఇచ్చారంటూ ప్రశ్నిస్తుంది. పోలీస్ పర్మీషన్ వేడుకల కోసం అని తీసుకుని.. ఇలాంటి పనులు చేశారని పోలీస్ శాఖ చెబుతోంది. 

మొత్తానికి గెలిచిన ఎంపీ.. నియోజకవర్గ ప్రజలకు ఇలా బీరు, బిర్యానీతో పార్టీ ఇవ్వటం.. అది కూడా 20 వేల మందికి ఇవ్వటం అనేది ఏదైతే ఉందో.. అది మాత్రం హైలెట్ అంటున్నారు యూత్..