భారీగా పెరగనున్న మద్యం ధరలు

భారీగా పెరగనున్న మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త విధానంలో క్వార్టర్ పై కనీసం రూ. 50 పెరగనున్నట్టు సమాచారం. చీప్ లిక్కర్ దగ్గర నుంచి ఖరీదైన బ్రాండ్ల వరకు భారీగా ధరలు పెరగనున్నాయి. నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టనుంది. అంతేకాదు రాష్ట్రం మొత్తం మీద 20 శాతం వైన్ షాపులు మూతపడుతున్నాయి. ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనే నిర్ణయంలో భాగంగా క్రమంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గించనుంది ఏపీ సర్కారు.