మోదీ పథకాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలి : ఆలే భాస్కర్

బాన్సువాడ, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామగ్రామాన ప్రచారం చేసి, ప్రజలకు వివరించాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ లోని పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలే భాస్కర్​ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే కేంద్రప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన ద్వారా చేతి, కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తోందని, అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గార్గే, అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కో కన్వీనర్ భూపాల్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, చీకట్ల రాజు, కొండని గంగారం, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.