Aleem Dar: సొంతగ్గడపైనే వీడ్కోలు: 25 ఏళ్ళ కెరీర్‌కు అంపైర్ అలీమ్ దార్ రిటైర్మెంట్

క్రికెట్ లో మోస్ట్ సీనియర్, ఎక్కువ మ్యాచ్ లకు అంపైరింగ్ చేసిన అలీమ్ దార్ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. పాకిస్థాన్ లో జరగబోతున్న వన్డే కప్ తర్వాత తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అతనే స్వయంగా వెల్లడించాడు. 1998 అంపైరింగ్ బాధ్యతలు చేపట్టి 56 సంవత్సరాల వయసులో తన 25 ఏళ్ళ అంపైరింగ్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నాడు.  

"దాదాపు 25 సంవత్సరాలుగా అంపైరింగ్ చేశాను. ఈ తరంలోని గొప్ప ఆటగాళ్లు ఆడిన పెద్ద మ్యాచ్‌ల్లో కొన్నింటిని నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ మ్యాచ్ అధికారులతో కలిసి పనిచేయడం గౌరవంగా అనిపిస్తుంది. ఎంత గొప్ప ప్రయాణాలు అయినా చివరికి ముగియాలి. ప్రస్తుతం నేను నా సామాజిక.. స్వచ్ఛంద కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది". అని అలీమ్ దార్ చెప్పుకొచ్చాడు. 

Also Read : కివీస్‌ను తిప్పేశారు: 88 రన్స్‌కే న్యూజిలాండ్ ఆలౌట్

అలీమ్ దార్ ప్రస్తుతం PCB యొక్క ఎలైట్ ప్యానెల్‌లో భాగంగా ఉన్నాడు. ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్‌లోని నలుగురు పాకిస్తానీ అంపైర్‌లలో ఒకడుగా ఉన్నాడు. ఇప్పటివరకు దార్ 145 టెస్టులు, 231 వన్డేలు, 72 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు వీటితో పాటు 5 మహిళల 20 మ్యాచ్ లు.. 181 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు.. 282 లిస్ట్-ఎ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశాడు. ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ (2009-2011) ప్రతిష్టాత్మకమైన డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్నాడు.