
Alekhya Chitti pickles: వారం, పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్.. ఒక్క ఆడిపోయో లీక్ దెబ్బకి ముగ్గురు అమ్మాయిల పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చెయ్యడంతోపాటూ ఇకనైనా మాపై మీమ్స్, ట్రోల్స్ ఆపండి అంటూ రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్ కి వచ్చేశారు.. అయితే వరుస ఆడియో, వాట్సాప్ లీకుల కారణంగా మీమర్స్ కి మంచి స్టఫ్ దిరికింది.. ఇంకేముంది.. అందరూ అలేఖ్య చిట్టి సిస్టర్స్ గురించి వరుసగా వీడియోలు, మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అలేఖ్య ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో చేరినట్లు అలేఖ్య సోదరి సుమ ఓ వీడియో ద్వారా తెలిపింది.
ప్రస్తుతం అలేఖ్య ఆరోగ్యం బాగాలేదని ఈ క్రమంలో ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఐసీయూలో ఉందని కాబట్టి ఇకనైనా ఆమెపై ట్రోల్స్ మీమ్స్ ఆపాలని కోరింది. ఇటీవలే తమ తండ్రి మరణించాడని.. ఇంతలోనే మళ్ళీ మరో మరణం జరిగితే తట్టుకోలేమని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే అలేఖ్య కూడా సారీ చెప్పినప్పటికీ కొందరు కావాలనే పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఇది సరికాదని వాపోయింది. మాకు పచ్చళ్ళు బిజినెస్, యూట్యూబ్ వీడియోలు ఇవేమి వద్దు.. మా అలేఖ్య బ్రతికితే చాలు ప్లీజ్ ఇకైనైనా ఆపండి అంటూ రిక్వెస్ట్ చేసింది.
Also Read:-ఎమెర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్ ని షిఫ్ట్ చేసిన డాక్టర్లు.. ప్రమాదం తప్పినట్లే..
ఇక అలేఖ్య మరో సోదరి రమ్య కూడా ఈ ట్రోలింగ్ పై మాట్లాడుతూ సీరియస్ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో రేపులు, మర్దర్లు జరుగుతున్నాయని, ఇవే కాకుండా ఎన్నో ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కొందరే కావాలనే అలేఖ్య చిట్టి పికిల్స్ విషయాన్ని పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలేఖ్య తప్పు చేసింది.. అందుకే సారీ కూడా చెప్పిందని కానీ కొందరు కావాలనే ఈ విషయాన్ని ఎత్తి చూపుతున్నారని ఇది సరికాదని వాపోయింది. ఏదేమైనప్పటికీ కష్ట పడి పికెల్స్ బిజినెస్ ని బిల్డ్ చేసుకున్నప్పటికీ కస్టమర్స్ తో కమ్యూనికేషన్ కారణంగా దెబ్బకి కూలిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.