
Alekhya Chitti Pickles sisters story: చిట్టి.. అలేఖ్య.. రమ్య.. ముగ్గురు అమ్మాయిలు.. అక్కచెల్లెళ్లు.. సోషల్ మీడియా ఇన్ఫలెన్సర్లు కూడానూ.. బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్లు.. ఇంకేముందీ.. ఈ ఫాలోవర్స్.. సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయి పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు.. పేరు ఏంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్.. నాన్ వెజ్ పికిల్స్.. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లు అన్నమాట.. టైటిల్ బాగానే ఉంది.. వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా.. అందులోనూ సోషల్ మీడియా ఇన్పులెన్సర్లు.. సో స్ట్రాటజీ ఉపయోగించారు.. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినటం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది.. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేసింది.. అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు.. చూసినోళ్లు ఊరికే ఉండరు కదా.. టేస్ట్ చేద్దామని ఆర్డర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు..
I bet no guy will skip this post 🚶🏻
— Karna⁴⁵ 🏹 ᴿᵉᵇᵉˡʷᵒᵒᵈ (@karna3102bc) April 1, 2025
Much needed motivation 🥺#Alekya #ChickenPickles pic.twitter.com/ZJQwEQoXn1
ఇక్కడే కథ అడ్డం తిరిగింది.. పికిల్స్ రేటు చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు.. ఇదే విషయం వాళ్ల వాట్సాప్ ఛానెల్ కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు.. పికిల్స్ రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి.. కిలో రొయ్యల పచ్చడి 3 వేల రూపాయలు ఏంటీ అండీ.. స్పెషల్ ఏంటీ అని అడిగాడు.. ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పులేదు కదా.. కిలో పచ్చడి 3 వేలు అంటే.. ఏదో స్పెషల్ ఉంటుంది కదా.. దాని గురించి ఈ ముగ్గురు అమ్మాయిలు వివరంగా చెప్పాలి కదా.. అందులోనూ బిజినెస్ ఛానెల్.. అప్పటికే వేల మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూప్..
ఇక్కడే అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ కు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది.. ఇంత ధర ఏంటీ అని అడుగుతావా.. 3 వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి.. నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావ్.. చీరలు ఏం కొనిస్తావ్.. బయటకు ఎలా తీసుకెళతావ్.. ముందు డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోరా.. పని చేసి డబ్బులు సంపాదించు.. అంతేకానీ పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ అలేఖ్య చిట్టి తన బూతు పురాణాన్ని అఫిషియల్ వాట్సాప్ ఛానెల్ లోనే పెట్టింది. కస్టమర్ పై అలేఖ్య చిట్టి సిస్టర్స్.. బూతు పురాణాన్ని.. వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు..
పచ్చడి ధర ఎక్కువ ఉంది.. అందులో స్పెషల్ ఏంటీ అని అడిగితే పచ్చడే కొనలేనోడికి పెళ్లి.. పెళ్లాం ఎందుకు అంటూ చేసిన కామెంట్లతో సోషల్ మీడియా రచ్చ రచ్చ చేసింది. దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. అయితే ఈ కస్టమర్ కి మీమ్ పేజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో దెబ్బకి ఈ ముగ్గురు సిస్టర్స్ ఆర్డ్సర్స్ తీసుకోవడం బంద్ చేసినట్లు సమాచారం. అంతేకాదు పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మొత్తానికి పచ్చళ్ళ బిజినెస్ తో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు నోటిదూలతో చేజేతులారా బిజినెస్ ని క్లోస్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు.