
Alekhya Sorry Video: వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో లీకుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే పికిల్స్ రేట్ ఇంతెందుకు అని అడిగినందుకు అలేఖ్య అనే అమ్మాయి అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ తిట్టింది. దీంతో తిట్లు తిన్న ఆ వ్యక్తి అలేఖ్య ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చెయ్యడంతో దెబ్బకి అప్పటివరకూ బాగా సాగుతున్న పచ్చళ్ళ వ్యాపారం ఒక్కసారిగా మూత పడింది.
అయితే అలేఖ్య అక్క సుమ, చెల్లెలు రమ్య కంచర్ల సోషల్ మీడియాలో ముందుకొచ్చి సారీ చెబుతూ సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ అసలు ఈ వివాదానికి కారణమైన అలేఖ్య మాత్రం ఇప్పటివరకూ సైలెంట్ గా ఉంది. దీంతో ఈ ఆడియో లీక్ ని మరింతగా వైరల్ చేస్తూ అలేఖ్య సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read:-తన భార్యకి బంగారం కొనేందుకు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్న హీరో ప్రియదర్శి...
తాజాగా అలేఖ్య సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇందులోభాగంగా ఓ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో "నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను... నేను తప్పు చేశాను.. ఇప్పటివరకూ ఇప్పటివరకూ తాను తిట్టిన వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నానని" తెలిపింది.
అయితే ఈ వీడియోలో అలేఖ్య దీనంగా మాట్లాడుతూ సారీ చెప్పడంతో నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. మరోసారి ఇలాంటి మిస్టేక్స్ చెయ్యొద్దని సూచిస్తున్నారు. మరి ఒక్క ఆడియో దెబ్బకు బంద్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం మళ్ళీ ఓపెన్ అవుతుందో లేదో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి