అలేఖ్య చిట్టి పికిల్స్ 2.O : పేరు మార్చి.. సరసమైన ధరలో మళ్లీ వచ్చేశారు..!

అలేఖ్య చిట్టి పికిల్స్ 2.O : పేరు మార్చి.. సరసమైన ధరలో మళ్లీ వచ్చేశారు..!

Ramya Moksha Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్.. ఎంత రాద్దాంతం జరిగింది. మగాళ్ల ఉసురుతగిలి నాశనం అయిన ఆడోళ్లు అంటూ ఎన్నెన్ని మాటలు అన్నారు..  సోషల్ మీడియా దెబ్బకు దుకాణం మూసేసి.. పెట్టాపేడా సర్దుకుని పారిపోయారు అనుకున్నారు అంతా.. అబ్బే.. అదేం లేదు.. అలేఖ్య చిట్టి పికిల్స్ 2.O అంటూ మళ్లీ వచ్చారు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు..

అప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ఉన్న పచ్చళ్ల కంపెనీని.. ఇప్పుడు రమ్య మోక్ఝ పేరుతో రీ ఓపెన్ చేశారు. అప్పుడు అంత ధరలు ఏంటీ అని అంటూ ప్రశ్నించారు కదా.. ఇప్పుడు తప్పు తెలుసుకుని సరసమైన ధరల్లో.. నాణ్యమైన పచ్చళ్లు అందిస్తాం అంటున్నారు.. ఎక్కడికీ వెళ్లలేదు.. ఎటూ పోలేదు.. ఇక్కడే ఉన్నాం.. ఇక్కడే వ్యాపారం చేస్తాం అంటున్నారు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. 

ఇక ఇంత ధరలు ఏంటీ అన్న కస్టమర్ ను పిచ్చిగా తిట్టిన బూతుల వల్లే కదా ఇంత రచ్చ జరిగింది. ఈ విషయంలో ఈ సిస్టర్స్ ఈసారి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పచ్చళ్ల అమ్మకాలకు సంబంధించి.. ఎంక్వయిరీ గురించి.. వాట్సాప్ లో చాటింగ్ నుంచి.. కాల్ చేస్తే మాట్లాడే వరకు.. అన్నింటికీ ఓ కాల్ సెంటర్ పెట్టారు. ఓ ఇద్దరు అమ్మాయిలను కాల్ సెంటర్ ఉద్యోగులుగా నియమించుకున్నారంట.. సో.. ఇక అలేఖ్య, రమ్య, మోక్ష ఎవరూ మాట్లాడరు.. మాట్లాడే వాళ్లు కాల్ సెంటర్ ఉద్యోగులు అన్నమాట..

సరసమైన ధరల్లో.. నాణ్యమైన నాన్ వెజ్ పికిల్స్ ను.. రమ్య మోక్ష పికిల్స్ పేరుతో.. మళ్లీ వచ్చేశారు అలేఖ్య చిట్టి సిస్టర్స్.. ఎంతండీ.. జస్ట్ 20 అంటే 20 రోజుల్లో మళ్లీ వచ్చేశారు.. ఈసారి వీళ్ల పచ్చళ్లను ఎలా ఆదరిస్తారు అనేది వెయిట్ అండ్ సీ..