అలెన్ బోర్డర్ విమర్శ
సిడ్నీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. సిడ్నీ టెస్ట్‌లో షాట్స్ ఆడేందుకు భయపడ్డాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ విమర్శించాడు. థర్డ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 176 బాల్స్ ఆడిన పుజారా 50 రన్స్ చేశాడు. పుజారా కెరీర్‌లోనే ఇది స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే, 2018–19 సిరీస్ మాదిరిగా పుజారా ఇప్పుడు ప్రభావం చూపలేకపోతున్నాడని బోర్డర్ అన్నాడు. ‘ నాకైతే పుజారా షాట్స్ ఆడేందుకు భయపడుతున్నాడని అనిపిస్తోంది. స్కోరు చేయడం కంటే వికెట్ కాపాడుకునేందుకు అతను ప్రయారిటీ ఇస్తున్నాడు. ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటున్నా రన్స్ చేయలేకపోతున్నాడు. దాని వల్ల ఈ సిరీస్‌లో అంత ప్రభావం చూపడం లేదు. అంతేకాక తన ఆట తీరు వల్ల మిగిలిన జట్టుపైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలింగ్‌పై పైచేయి సాధించలేకపోతున్నారు’ అని బోర్డర్ అభిప్రాయపడ్డాడు.
For More News..