- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి గుట్ట పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి నిలయమైన యాదగిరిగుట్ట పట్టణాన్ని ప్రత్యేక నిధులతో డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, కౌన్సిలర్లు సీస విజయలక్ష్మి కృష్ణ గౌడ్, గౌలీకార్ అరుణ రాజేష్, కాంగ్రెస్ మండల నాయకుడు వంగపల్లి అరణ్ తదితరులు ఉన్నారు.